“కేజీయఫ్ 2″లో ప్రకాష్ రాజ్ రోల్ పై రెండు వెర్షన్లు.!

“కేజీయఫ్ 2″లో ప్రకాష్ రాజ్ రోల్ పై రెండు వెర్షన్లు.!

Published on Aug 27, 2020 8:03 AM IST

ఒక్క మన దక్షిణాది నుంచి మాత్రమే కాకుండా మొత్తం మన దేశం లోనే భారీ చిత్రంగా వస్తున్నది “కేజీయఫ్ చాప్టర్ 2”. దీనికి ముందు చిత్రం ఊహలకందని హిట్ కావడంతో ఈ భారీ చిత్రంపై ఎనలేని అంచనాలు పెరిగిపోయాయి. దీనితో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని యావతు భారత దేశీయ సినీ లోకం ఎదురు చూస్తుంది. అయితే ఏఈ ఏడాది అక్టోబర్ లో ప్లాన్ చేసిన ఈ చిత్రం షూటింగ్ కూడా కొన్నాళ్ల పాటు ఆగిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

కానీ ఎట్టకేలకు నిన్నటి నుంచి మొదలు అయ్యింది. అయితే ఈ చిత్రం సెట్స్ లో ప్రకాష్ రాజ్ కనిపించేసరికి సరికొత్త అనుమానాలు ఇప్పుడు ఫిల్మీ లవర్స్ ను తొలిచేస్తున్నాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ రోల్ కు సంబంధించి అయితే రెండు వెర్షన్ లు వినిపిస్తున్నాయి. మొదటగా ఈ చిత్రంలో ఒక కీలక రోల్ లో కనిపించిన అనంత్ నాగ్ ను ఈ చిత్రం నుంచి వాక్ అవుట్ చేసారని గత కొన్నాళ్ల కితం వినిపించిన వార్త.

అందుకు ఈ విలక్షణ నటుడు రీప్లేస్ చేస్తున్నారని అందుకే ఓ సీనియర్ రిపోర్టర్ లా ప్రకాష్ రాజ్ పై అలాంటి సీన్స్ తో ప్రారంభించారు అన్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే మరోటి ఏంటంటే అనంత్ నాగ్ మరియు ప్రకాష్ రాజ్ లు ఇద్దరూ సీనియర్ మోస్ట్ రిపోర్టర్స్ గా కనిపిస్తారని వినిపిస్తుంది. మరి ఈ రెండిటిలో ఏ వెర్షన్ నిజమో తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు