సినిమా ఇండస్ట్రీకి ఈ ఏడాది అంతా నష్టమే !

సినిమా ఇండస్ట్రీకి ఈ ఏడాది అంతా నష్టమే !

Published on Aug 25, 2020 3:00 AM IST


తెలుగు సినీ పరిశ్రమకి ఈ 2020 మొదట్లో ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ లాంటి సూపర్ హిట్ చిత్రాల రూపంలో ఈ ఇయర్ ఓపెనింగ్ బాగానే ఉంది. ఈ రెండు సినిమాలు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేయడంటతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి ఆరంబాన్ని అందించాయి. ఈ విజయాలు చూసి ఈ ఏడాది అంతా ఈ శుభారంభమే కొనసాగుతుందని.. తరువాత వచ్చే సినిమాలు కూడా ఇలాగే విజయాల్ని సాధించాలని అంతా ఆశిస్తే… మొత్తానికి ఈ ఏడాది ఎవ్వరికీ కలిసిరాలేదు..

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి.. ఇండస్ట్రీలోని జనాలకు ఈ సంవత్సరం ఒక పీడకలగా మిగిలిపోనుంది. ఇప్పట్లో థియేటర్లు తెరవరు. తెరిసినా జనం వస్తారని నమ్కం లేదు. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టాలంటే భయపడే పరిస్థితి. వీటన్నిటి మధ్యలో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితంగా సినిమా వాళ్లకు ఈ ఏడాది ఒక పీడకలే. ఈ కరోనా రాకతో సినిమాల రిలీజ్ కూడా ఏమి లేకుండా పోయాయి. కరోనా ఎప్పుడు పోతుందో.. తెలియదు. పోనీ ఓటీటీలోనైనా సినిమాలను రిలీజ్ చేద్దామంటే.. పెట్టిన పెట్టుబడులు కూడా రావేమో అని భయం.

తాజా వార్తలు