మంచు వారమ్మాయి పేరు మీద పెర్ఫ్యూమ్

మంచు వారమ్మాయి పేరు మీద పెర్ఫ్యూమ్

Published on Dec 15, 2012 10:02 PM IST

Manchu-Laxmiనటిగా, నిర్మాతగా, టీవీ యాంకర్ గా సినిమాలోనే నిజ జీవితంలో కూడా ఎన్నో విభన్నమైన పాత్రలు పోషిస్తున్నారు మంచు లక్ష్మి. సినిమా పనుల్లో బిజీగా ఉండే ఆమె ఇటీవల ఒక కొత్త పెర్ఫ్యూమ్ మార్కెట్లోకి తేనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళినపుడు అక్కడ ఒక పెర్ఫ్యూమ్ కంపెనీలో పని చేసానని, పెర్ఫ్యూమ్ గురించి అప్పుడు బాగా తెలుసుకొని ఒక కొత్త పెర్ఫ్యూమ్ మార్కెట్ లోకి పరిచయం చేయాలని అనుకున్నానని ఆమె అన్నారు. ‘ఐకనా క్లాస్ట్’ పేరిట ఆమె ఒక పెర్ఫ్యూమ్ మార్కెట్లో విడుదల చేసారు. దాని విలువ ఆరు వేల రూపాయలు. ప్రస్తుతం ఆమె నిర్మించిన గుండెల్లో గోదారి సినిమా విడుదలకు సిద్ధమైంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఆమె అన్నారు.

తాజా వార్తలు