రీమిక్స్ కానున్న మరో చిరంజీవి పాట

రీమిక్స్ కానున్న మరో చిరంజీవి పాట

Published on Dec 15, 2012 5:53 PM IST

Chiru-about-Sai-Dharam-Tej
పాటలను రీమిక్స్ చెయ్యడం కొత్తేమి కాదు కాని ఈ మధ్య కాలంలో చిరంజీవి పాటలను రీమిక్స్ చెయ్యడం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే రెండు ప్రముఖ పాటలను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ రీమిక్స్ చేశారు. ‘మగధీర’ చిత్రంలో “బంగారు కోడిపెట్ట” పాటను రీమిక్స్ చేశారు తాజాగా “రచ్చ” చిత్రంలో “వాన వాన వెల్లువాయే” పాటను రీమిక్స్ చేశారు త్వరలో రాబోతున్న చిత్రం “నాయక్” చిత్రంలో “శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో” పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు సాయి ధరం తేజ్ వంతు వచ్చింది. అయన తెరకు పరిచయం కాబోతున్న చిత్రం “రేయ్” లో చిరంజీవి “దొంగ” చిత్రంలోని “గోలీమార్” పాటను రీమిక్స్ చెయ్యనున్నారు. సైయామి ఖేర్ మరియు శ్రద్ద దాస్ ఈ చిత్రంలో సాయి ధరం తేజ్ సరసన నటిస్తున్నారు. ఈ రీమిక్స్ పాటను ప్రస్తుతం సాయి ధరం తేజ్ మరియు శ్రద్ద దాస్ మధ్య తెరకెక్కిస్తున్నారు. రాజు సుందరం నృత్య దర్శకత్వం అందిస్తున్నారు. వై వి ఎస్ చౌదరి స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని పాటలు కొంత ప్యాచ్ వర్క్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఈ చిత్రం 2013లో విడుదల కానుంది.

తాజా వార్తలు