12 గంటల్లో తెరకెక్కనున్న12-12-12 చిత్రం

12 గంటల్లో తెరకెక్కనున్న12-12-12 చిత్రం

Published on Dec 13, 2012 2:14 AM IST

12-12-12
12-12-12 ఈ తేదీ ప్రత్యేకత ఏంటో అందరికి తెలిసిందే ఇదే రోజు పరిశ్రమలో ఆడియో విడుదల వేడుకలు జరిగాయి, టీజర్లు విడుదల చేశారు, ఫస్ట్ లుక్ లు విడుదల చేశారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇదే తేదీని పేరుగా మలచుకొని ఒక చిత్రం ప్రారంభం అయ్యింది “12-12-12” అన్న పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రత్యేకత ఏంటంటే చిత్రాన్ని కేవలం 12 గంటల్లో చిత్రీకరించడం. పి సి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచి సందేశంతో తెరకెక్కించనున్నారు. ఆసక్తికరమయిన విషయం ఏంటంటే పిసి ఆదిత్య గత ఏడాది 11-11-11న 11 గంటల వ్యవధిలో చిత్రాన్ని తెరకెక్కించి రికార్డ్ సృష్టించారు. 12-12-12 చిత్రం మణికొండలో ఉదయం 9 గంటలకు చిత్రీకరణ మొదలు పెట్టుకొని రాత్రి 9 కి ముగుస్తుంది ఈ చిత్రానికి సందీప్ సంగీతం అందించగా గణేష్ సినిమాటోగ్రఫీ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు