సాయి తేజ్ సినిమాకు కూడా ఆఫర్ వచ్చిందా.?

సాయి తేజ్ సినిమాకు కూడా ఆఫర్ వచ్చిందా.?

Published on Jul 31, 2020 11:07 PM IST


ఓ సాలిడ్ హిట్ అనంతరం మళ్ళీ అదే రేంజ్ హిట్ ను అందుకోడానికి మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు చాలా కాలమే పట్టింది. ఇక అలాగే దాని తర్వాత తీసిన సుబ్బు దర్శకత్వంలో “సోలో బ్రతుకే సో బెటర్” అనే యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ చిత్రంలో నటించాడు. టైటిల్ నేటి తరం యువతకు బాగా కనెక్ట్ కావడం అందులోను సంగీత దర్శకుడు ఇచ్చిన బాణీలు కూడా మరింత ఆకట్టుకోవడం టీజర్ కు కూడా మంచి మార్కులు పడడంతో సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. అన్ని కుదిరి మే నెలలో ఈ చిత్రం విడుదల అవ్వాల్సి ఉంది.

కానీ ఊహించని కరోనా ఎంటర్ కావడంతో ఆగిపోవాల్సి వచ్చింది. దీనితో ఇదే సమయంలో స్ట్రీమింగ్ సంస్థలు అనేక సినిమాలకు ఆఫర్స్ ఇవ్వడం మొదలు పెట్టాయి. అలాగే ఇప్పటి వరకు చాలానే సినిమాలు విడుదల కూడా అయ్యాయి. అలా ఈ చిత్రానికి కూడా ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ 20 కోట్లకు పైగానే ఆఫర్ ఇచ్చిందట. కానీ తాము కూడా సినిమాను అలా విడుదల చేసే యోచనలో లేనట్టుగా చిత్ర యూనిట్ చెప్పి ఆ అఫర్ ను తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఈ కరోనా ఫీవర్ తగ్గిన తర్వాత ఓ మంచి ముహూర్తాన ఈ చిత్రం విడుదల కానుంది.

తాజా వార్తలు