రెండో చిత్రంతోనే ఆ ఫీట్ అందుకున్న ఏకైక హీరో.

రెండో చిత్రంతోనే ఆ ఫీట్ అందుకున్న ఏకైక హీరో.

Published on Jul 31, 2020 3:52 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులను తుడిపెట్టిన మగధీర విడుదలై నేటికీ సరిగ్గా 11 ఏళ్ళు. 2009 జులై 31న మగధీర మూవీ విడుదలై చిత్ర సృష్టించింది. కేవలం రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోగా రామ్ చరణ్ నిలిచాడు. 2007 లో పూరి దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా పరిశ్రమకు పరిచయమైన రామ్ చరణ్ రెండో సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర చేశారు. ఫాంటసీ యాక్షన్ అండ్ లవ్ డ్రామాగా వచ్చిన ఆ మూవీ రికార్డుల లెక్కల గురించి ఎంత చెప్పినా తక్కువే.

కాగా నేడు మగధీర విడుదలై 11ఏళ్ళు పూర్తయిన సంధర్భంగా రామ్ చరణ్ ఆ అపూర్వ విజయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ మూవీ ద్వారా తను ఎంతో నేర్చుకున్నాడని, రాజమౌళి తన నైపుణ్యాలను ఎంతగానో మెరుగుపరిచారని అన్నారు. అంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు,చిత్ర యూనిట్ కి ధన్యవాదులు తెలిపిన రామ్ చరణ్, కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుందని నిరూపించిన చిత్రం అన్నారు.

https://www.instagram.com/p/CDTCV-6jNoK/

తాజా వార్తలు