రియా పై మరిన్ని అనుమానాలు..సుశాంత్ పై షాకింగ్ కామెంట్స్.!

రియా పై మరిన్ని అనుమానాలు..సుశాంత్ పై షాకింగ్ కామెంట్స్.!

Published on Jul 31, 2020 2:35 PM IST

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య ఘటనతో నెలకొన్న విషాదం ఇంకా కొనసాగుతుంది. అసలు నిజం ఏమిటి అన్నదాని చుట్టూతా ఎన్నో రకాల స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. మొదట్లో సుశాంత్ ది ఆత్మ హత్యే అని మొదలైనా ముగింపు మాత్రం వేరేలా ఉంటుంది అనిపిస్తుంది.

అయితే ఈ కేసు విషయంలో మాత్రం సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పై ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలు మరింత బలపడేలా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఆమె సుశాంత్ ను ఉద్దేశించి కొన్ని సంచలన కామెంట్స్ చేసిన వీడియో ఒకటి బయటకొచ్చింది.

అందులో ఆమె సుశాంత్ పై ఉద్దేశ పూర్వకంగా చేసిందో లేక సరదాగా ఆందో కానీ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుశాంత్ ఒక బుద్ది లేని తెలివితక్కువ వాడని అతన్ని ఎలా కంట్రోల్ లో పెట్టాలో తనకి బాగా తెలుసనీ ఆ వీడియోలో ఉన్న కామెంట్స్ దీనితో ఈమెపై ఇప్పుడు అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. మరి ఏది ఏమైనప్పటికీ అసలు నిజం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు