కొరటాలతో బన్నీ భారీ పాన్ ఇండియా మూవీ.

కొరటాలతో బన్నీ భారీ పాన్ ఇండియా మూవీ.

Published on Jul 31, 2020 1:13 PM IST

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త ఇది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఆయన మూవీ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన 21వ చిత్రం కొరటాల శివతో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడం జరిగింది. ఇక ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆసక్తి రేపుతుంది. సముద్ర తీరాన ఇద్దరు వ్యక్తులు నిలబడి, తీరాన దూరంగా ఉన్న ఓ నగరాన్ని చూస్తున్నారు. డార్క్ షేడ్ లో ఉన్న ఆ పోస్టర్ లో ఆకాశంలో గద్దలు తిరుగుతున్నాయి. ఇక ఇది కొరటాల మార్కు సోషల్ అండ్ సీరియస్ సబ్జెక్టు గా తెలుస్తుంది.

కాగా ఈ మూవీని కూడా బన్నీ పాన్ ఇండియా చిత్రంగా చేస్తున్నారు. నాలుగు భాషలలో భారీగా ఈ మూవీ విడుదల కానుంది. యువసుధ ఆర్ట్స్, జి ఏ 2 పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా ఉన్నారు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 ప్రారంభంలో మూవీ విడుదల కానుంది.

తాజా వార్తలు