ఆర్ ఆర్ ఆర్ నేడే విడుదల…అదే అలా జరగకుండా ఉంటే!

ఆర్ ఆర్ ఆర్ నేడే విడుదల…అదే అలా జరగకుండా ఉంటే!

Published on Jul 30, 2020 11:15 PM IST


రామ్ చరణ్, ఎన్టీఆర్ కి గాయాలు కాకుంటే, వ్యక్తిగత కారణాలతో రాజమౌళి షూటింగ్ వాయిదా వేయకుంటే, కరోనా వైరస్ లేకుంటే, లాక్ డౌన్ ప్రకటించకుంటే, థియేటర్స్ మూతపడకుంటే నేడు వెండి తెరపై ఓ అధ్బుతం ఆవిష్కృతం అయ్యేది. అవును ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీగా మొదట ప్రకటించింది జులై 30, 2020. పైన చెప్పిన అనేక కారణాలు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ని లేటు చేశాయి. దానివలన నేడు విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ మూవీని జనవరి 8, 2021కి వాయిదా వేశారు.

ఇక కరోనా వైరస్ మరియు లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. అలాగే 2021 జనవరిలో కూడా ఆర్ ఆర్ ఆర్ విడుదల జరిగడం కష్టమే అనిపిస్తుంది. ఎన్టీఆర్ మరియు చరణ్ అభిమానులతో పాటు, సగటు సినిమా అభిమాని ఆర్ ఆర్ ఆర్ త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, చరణ్ అల్లూరి పాత్ర పోషిస్తున్నారు.

తాజా వార్తలు