కింగ్ నాగ్ ప్రోమో రాబోతోందా..?

కింగ్ నాగ్ ప్రోమో రాబోతోందా..?

Published on Jul 30, 2020 8:56 PM IST


మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ఇప్పటి వరకు మూడు సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూడు షోలు ఒక్కొక్కటి ఒకదాన్ని మించి భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. అలా నాలుగో సీజన్ ఉంటుందా ఉండదా అన్న సంశయంలో స్టార్ మా వారు లేటెస్ట్ ప్రోమో ద్వారా కన్ఫర్మ్ చేసేసారు.

అలాగే ఈసారి కూడా కింగ్ నాగార్జునే మళ్లీ హోస్ట్ గా కనిపించడం కూడా ఖరారు అయ్యింది. అయితే గత సీజన్ కు గాను నాగార్జునను చూపించడంలో ఎంత సస్పెన్సును మెయింటైన్ చేశారో తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్ కు గాను నాగ్ పై అదిరిపోయే టీజర్ ను కట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే దీనిని అతి త్వరలోనే విడుదల చేయనున్నట్టు టాక్. ఇప్పటికే నాగ్ చాలా జాగ్రత్తలు తీసుకొంటు ప్లాన్ చేస్తున్నారు.మరి ఈసారి సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు