ప్రభాస్ 21 బడ్జెట్ డిసైడ్ చేయనున్న ఆర్ ఆర్ ఆర్..!

ప్రభాస్ 21 బడ్జెట్ డిసైడ్ చేయనున్న ఆర్ ఆర్ ఆర్..!

Published on Jul 30, 2020 3:38 PM IST

వెండితెరపై బొమ్మాడి నాలుగు నెలలు అవుతుంది. మార్చి చివరి వారంలో మూతపడిన థియేటర్స్ ఇంత వరకు తెరుచుకోలేదు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో థియేటర్స్ తెరుచుకోవడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఒకవేళ థియేటర్స్ తెరుచుకున్నా కరోనా భయంతో గతంలో మాదిరి ప్రేక్షకులు వస్తారన్న గ్యారంటీ లేదు. ఖచ్చితంగా సినిమా కోసం థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల శాతం ఎంతో కొంత తగ్గుతుంది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇది కలవర పెట్టే అంశమే. కాబట్టి థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత విడుదలైన చిత్రాల టాక్, వసూళ్లను బట్టి వైరస్ ప్రభావం ఎంత వరకు ప్రేక్షకులపై ఉంది అనేది అంచనా వేయవచ్చు.

దీనితో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు వచ్చే ఏడాది విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ వసూళ్లను గమనించాలని అనుకుంటున్నారు. ఆ మూవీ వసూళ్ల ఆధారంగా బడ్జెట్ నిర్ణయించుకుంటే బెటర్ అనేది వాళ్ళ ఆలోచనట. ముఖ్యంగా ప్రభాస్ 21 మూవీ నిర్మాతలు ఆర్ ఆర్ ఆర్ వసూళ్లను బట్టి బడ్జెట్ నిర్ణయించుకొనే అవకాశం ఉంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న పాన్ ఇండియా మూవీని అశ్వినీ దత్ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించాలి అనుకుంటున్నారు. థియేటర్స్ వసూళ్ల సామర్ధ్యం తగ్గిపోతే ఇంత పెద్ద బడ్జెట్ మూవీ పెట్టుబడి, లాభాలు రాబట్టడం కష్టం. అందుకే వారు వచ్చే ఏడాది విడుదల కానున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ వసూళ్ల ఆధారంగా ప్రభాస్ 21 బడ్జెట్ నిర్ణయిస్తారని ఓ వార్త వినిపిస్తుంది.

తాజా వార్తలు