మమ్మల్ని పూజించి నట్టే మీ పేరెంట్స్ ని పూజించండి – రజనీ

మమ్మల్ని పూజించి నట్టే మీ పేరెంట్స్ ని పూజించండి – రజనీ

Published on Dec 13, 2012 1:16 PM IST

Rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీ, వినయ విధేయతలు కలిగిన వ్యక్తి అంటే అందరూ ఔననే అంటారు. అలాంటి రజనీ 12-12-12 స్పెషల్ డే రోజున పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తన అభిమానులకు రజనీకాంత్ కొన్ని సూచనలు ఇచ్చారు. ‘నాకు సంబందించిన ప్రతి పుట్టిన రోజుకి ఇలా మీరంతా వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా పుట్టిన రోజు నాడు అన్నదానం, వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నందుకు అభిమానులకు నా కృతఙ్ఞతలు. కానీ నన్ను ఎంతలా అభిమానిస్తున్నారో అంత కంటే ఎక్కువగా మీ తల్లితండులను గౌరవించండి, మీ పేరెంట్స్ కి పుట్టిన రోజు వేడుకలు కూడా సెలబ్రేట్ చేయండి. తల్లితండ్రులు మాత్రమే మనం ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారని’ రజనీ అన్నారు. ఇలాంటి మంచి వాఖ్యాలు చెప్పిన సూపర్ స్టార్ కి ఇండియా అంటే ఎంతో గౌరవం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు