కనీసం అలాంటి ఓ సోలో హిట్టు కొట్టి చూపించు..!

కనీసం అలాంటి ఓ సోలో హిట్టు కొట్టి చూపించు..!

Published on Jul 28, 2020 11:02 AM IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ సంచలనే. బాలీవుడ్ లో కొందరు పెద్దలను ఉద్దేశిస్తూ ఆమె చేసే మాటల దాడి చాలా ఘాటుగా ఉంటుంది. ఇక ఈ అమ్మడుకి బాలీవుడ్ లో అనేక మంది శత్రువులు ఉండగా అందులో హీరోయిన్ తాప్సి పన్ను ఒక్కరు. వీరిద్దరి మధ్య ఎప్పటి నుండో మాట పట్టింపులు ఉన్నాయి. సుశాంత్ సింగ్ మరణం తరువాత కంగనా రనౌత్ నెపోటిజంపై దారుణ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కంగనాను తప్పుబట్టిన తాప్సి గతంలో ఆమె స్టార్ కిడ్స్ కి అనుకూలంగా మాట్లాడిన వీడియోలు బయటపెట్టి, కంగనాది మొత్తం హిపోక్రసి అని విమర్శించింది.

ఇక కొంత కాలంగా వీరిద్దరి మధ్య మాటల దాడి కొనసాగుతుండగా, కంగనా, తాప్సికి ఓ సవాలు విసిరింది. తన కెరీర్ లో క్వీన్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ మరియు మణికర్ణిక వంటి సోలో హిట్స్ ఉన్నాయని, అలాంటి ఒక సోలో హిట్ తను కొట్టి చూపించాలని సవాలు విసిరింది. మరి కంగనా ఛాలెంజ్ కి తాప్సి ఎలా స్పందిస్తుందో చూడాలి.

తాజా వార్తలు