“ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రాన్ని ప్రమోట్ చెయ్యడానికి దర్శకుడు గౌతం మీనన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు మీడియాతో అయన స్వయంగా మాట్లాడారు. ఇందులో కొన్ని ఆసక్తి కరమయిన అంశాలను తెలిపారు.
ఈ చిత్రంలో నాని నటనను గౌతం మీనన్ మెచ్చుకున్నారు. “నాని దర్శకుడికి ఎలా కావాలంటే అలా నటించే నటుడు ఈ చిత్రంలో అతను నటించడం నా అదృష్టం, నేను కెమెరా ఆన్ చెయ్యగానే ఒక్క లోపం లేకుండా నటించేవాడు” అని గౌతం మీనన్ అన్నారు.
భవిష్యత్తు చిత్రాల గురించి అడుగగా “సూర్యతో ఒక యాక్షన్ చిత్రం చేస్తున్నాను లవ్ స్టోరీస్ నుండి కాస్త దూరంగా ఉంటుంది ఆ చిత్రం” అని అన్నారు. “హిందీ ఫిలిం మార్కెట్ గురించి నేను పట్టించుకోను అది నాకు ఇంకొక మార్కెట్ అంతే, ఇది నేను అక్కడ పరాజయాల గురించి చెప్పట్లేదు నిజంగా నాకు అది ఇంకొక మార్కెట్ మాత్రమే భవిష్యత్తులో మంచి కథతో పెద్ద తారతో చిత్రం చెయ్యవచ్చు కాని ఇప్పటికి అయితే ఆ ఆలోచన లేదు” అని అన్నారు.