ఒకరేమో టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు, ఇంకొకరేమో కమర్షియల్ ఫార్మాట్లో విమర్శకుల ప్రశంశలు అందుకునే దర్శకుడు, ఇంతకీ ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా ఇంకెవరండీ మన ఎస్.ఎస్ రాజమౌళి మరియు క్రిష్. అలాంటి వీరిద్దరూ అనుకోకుండా కలిస్తే వీరి ఆలోచనలు ఎలా ఉంటాయో మనం ఊహించగలం. ‘ ముంబైకి వెళుతున్న ఫ్లైట్ లో అనుకోకుండా క్రిష్ ని కలిసాను. తన నెక్స్ట్ సినిమాకి సంబందించిన స్టొరీ లైన్ చెప్పాడు. అది ఏంటని నేను చెప్పలేను కానీ మహేష్ బాబు అభిమానులు అద్భుతమైన అనుభూతికి లోనవుతారని’ రాజమౌళి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
‘ఈగ’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజమౌళి ప్రభాస్ తో తీయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు, అలాగే క్రిష్ కూడా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకొని తను మహేష్ తో తీయనున్న నెక్స్ట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ చేస్తున్న ఈ రెండు సినిమాలపై సినీ అభిమానులకు భారీ అంచనాలున్నాయి.