డిసెంబర్ 23న ప్రభాస్ మిర్చి ఆడియో?

డిసెంబర్ 23న ప్రభాస్ మిర్చి ఆడియో?

Published on Dec 11, 2012 2:30 AM IST


ప్రభాస్ ప్రధాన పాత్రలో రానున్న “మిర్చి” చిత్ర ఆడియో విడుదల డిసెంబర్ 23, 2013 జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాటల రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రంలో అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ టీజర్ సినిమా ప్రేమికులలోను మరియు ప్రభాస్ అభిమానుల లోను మరింత అంచనాలను సృష్టించింది.

తాజా వార్తలు