బిజీబిజీగా గడుపుతున్న సమంత

బిజీబిజీగా గడుపుతున్న సమంత

Published on Dec 11, 2012 1:30 AM IST


ఇటు చిత్రాలతో అటు యాడ్ ఫిలిమ్స్ తో సమంత బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యనే మహేష్ బాబు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో ఒక పాట కోసం పూణే వెళ్ళిన ఈ భామ అక్కడ చిత్రీకరణ అయిపోగానే అక్కడ నుండి ముంబైకి వెళ్ళారు. అక్కడ డాబర్ వారి ఒడోనిల్ యాడ్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. తను బ్రాండ్ అంబాసడర్ గా చేస్తున్న మొదటి యాడ్ ఇది. ఈ విషయం ట్విట్టర్లో స్వయంగా చెప్పారు. ఈ యాడ్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న తరువాత హైదరాబాద్ తిరిగి వచ్చి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రీకరణలో పాల్గొంటారు. ఇది కాకుండా “ఆటోనగర్ సూర్య” చిత్రంలో ఒక పాట చిత్రీకరణలో పాల్గొంటుంది. డిసెంబర్ 20 కల్లా చిత్రీకరణలు పూర్తి అయిపోతుందని గతంలో చెప్పారు. కాస్త విరామం తరువాత ఎన్టీఆర్ – హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల చిత్రాల చిత్రీకరణలో పాల్గొననున్నారు.

తాజా వార్తలు