భయం గుప్పిట్లో టాలీవుడ్..!

భయం గుప్పిట్లో టాలీవుడ్..!

Published on Jun 26, 2020 8:08 PM IST


లాక్ డౌన్ సడలింపులతో షూటింగ్స్ తో టాలీవుడ్ కళ సంతరించుకుంటుంది, కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అందరూ భావించారు. ఐతే వారి ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు. సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగినంత కాలం అదుపులో ఉన్న కరోనా వైరస్ ఇప్పుడు విజృంభిస్తుంది. సడలింపుల అనంతరం అధిక మొత్తంలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఇటీవల కొన్ని చిన్న చిత్రాలు, సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్స్ కారణంగా కొందరు బుల్లితెర నటులు కరోనా వైరస్ బారిన పడ్డారు.

ఇప్పటికే టాలీవుడ్ నటుడు మరియు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి కరోనా వైరస్ సోకింది. హైదరాబాద్ నగరంలో వైరస్ విజృంభిస్తుండగా…బయటికి వెళ్లడం కూడా క్షేమం కాదని టాలీవుడ్ స్టార్స్ అంకుంటున్నారట. కొందరు నటులు తమ ఇళ్లకు రాకపోకలు నిషేదించారట. అలాగే పని వారికి కూడా అనుమతి నిరాకరించారని సమాచారం అందుతుంది. వయసు పైబడిన సీనియర్ నటులు మరింత జాగ్రత్తగా ఉంటున్నారట. మొత్తంగా టాలీవుడ్ కి పునర్వైభవం రావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు