ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో సుకుమార్..!

ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో సుకుమార్..!

Published on Jun 26, 2020 9:14 AM IST

ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడికి మరో సినిమా కోసం…రెండేళ్లు గ్యాప్ రావడం అంటే చాల బాధాకర విషయం. అది కూడా స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని ఉండగా హీరో దొరకకపోవడం ఇబ్బందిపెట్టే అంశమే. 2018 లో రంగస్థలం అనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్ ఆ మూవీ విడుదల అనంతరం స్క్రిప్ట్ పట్టుకొని అందరు టాప్ హీరోల దగ్గరకు వెళ్లారు. ఆయన మొదట మహేష్ పుష్ప మూవీ చేయాలనుకున్నాడు. కొన్నాళ్ళు వెయిటింగ్ లో పెట్టిన మహేష్, తరువాత చేయను అన్నారు.

ఆ తరువాత బన్నీ కోసం ఆయన ఎదురు చూడగా సుకుమార్ కి బదులు ఆయన త్రివిక్రమ్ ని ఎంచుకున్నారు. ఐతే త్రివిక్రమ్ మూవీ తరువాత చేద్దాం అని హామీ ఇచ్చారు. ఇక లేటైనా అన్నీ కుదిరాయి షూటింగ్ మొదలుపెడదాం అనుకునే నాటికి కరోనా వైరస్ దెబ్బేసింది. లాక్ డౌన్ కి ముందు బన్నీ లేకుండా ఓ షెడ్యూల్ సుకుమార్ కేరళలో చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ కూడా కేరళలో మొదలుకావాల్సివుంది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో పాటు, ఆంక్షల మధ్య షూటింగ్ నడపలేని పరిస్థితి. దీనితో సుకుమార్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు