ఒక్కడినే ఒక రోజు ఆలస్యంగా రానుందా?

ఒక్కడినే ఒక రోజు ఆలస్యంగా రానుందా?

Published on Dec 10, 2012 1:39 PM IST


తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నారా రోహిత్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఒక్కడినే’ విడుదల డిసెంబర్ 15కి వాయిదా పడింది. అనుకున్న దాని ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 14న విడుదల కావాలి కానీ ఒకరోజు ఆలస్యంగా విడుదల కానుంది. ఈ విషయం పై ఖచ్చితమైన సమాచారం కోసం ప్రయత్నిస్తున్నాము.శ్రీనివాస్ రాగా ఈ సినిమాకి డైరెక్టర్. సి.వి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి సింగర్ కార్తీక్ మ్యూజిక్ ఇచ్చాడు.

అనుకున్న సమయానికి వస్తే ఈ సినిమా గౌతం మీనన్ డైరెక్షన్లో రానున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద తలపడాల్సింది. ‘ఒక్కడినే’ టీం నుంచి అధికారిక సమాచారం కోసం ప్రయత్నిస్తున్నాం మాకు తెలియగానే మీకు అందిస్తాము.

తాజా వార్తలు