మరోసారి బ్యాంకాక్ పై కన్నేసిన పూరి.!

మరోసారి బ్యాంకాక్ పై కన్నేసిన పూరి.!

Published on Dec 10, 2012 8:26 AM IST


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని బ్యాంకాక్ మరోసారి ఆకర్షించింది. పూరి బ్యాంకాక్ తో మంచి సంబందాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు బ్యాంకాక్ వెళ్లానని, ఆయన సినిమాలకు సంబందించిన స్టోరీలు, డైలాగ్స్ అక్కడే రాస్తాడని పూరి ఇదివరకే తెలిపాడు. పూరి జగన్నాథ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ లో అసలు బ్యాంకాక్ లేదు. సినిమా మొత్తాన్ని న్యూజీల్యాండ్ మరియు ఆస్ట్రేలియాల్లో చిత్రీకరించాలనుకున్నారు. కానీ మేము చెప్పినట్టుగా ఈ సినిమాని పూరి తనకిష్టమైన బ్యాంకాక్లో తీయాలని నిర్ణయించుకున్నాడు.

కావున ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా న్యూజీల్యాండ్ , బ్యాంకాక్లలో చిత్రీకరించనున్నారు. దీన్నిబట్టే తెలుస్తోంది పూరికి బ్యాంకాక్ అంటే ఎంత ఇష్టమో అని. అల్లు అర్జున సరసన అమలా పాల్ మరియు కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 20 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు