సరైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను.!

సరైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను.!

Published on Dec 9, 2012 4:00 PM IST

విభిన్న చిత్రాల డైరెక్టర్ క్రిష్ ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో హిట్ అందుకుని ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్ళికి సంబందించిన విశేషాలను చెబుతూ ‘ పెళ్లి అనేది ఒక బాధ్యత, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ జీవితాంతం సంతోషంగా ఉంచగలననుకున్న అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నానని’ అన్నాడు. ఆడియన్స్ ని ఆలోచింపజేసే కథాంశాలతో సినిమాలు తీసే క్రిష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీయనున్న సినిమాకి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు