ఏం తొందర లేదంటున్న ప్రభాస్.!

ఏం తొందర లేదంటున్న ప్రభాస్.!

Published on Jun 9, 2020 10:00 PM IST


డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాధా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూడని రోజు లేదు. దీనికి ముందు చిత్రం “సాహో” విషయంలో కూడా చాలా కాలయాపన చేసారు ప్రభాస్.

ఇవన్నీ చూస్తుంటే ఎంత నెమ్మదిగా ఉన్నారో అర్ధం అవుతుంది. వీటన్నిటి మూలాన ఎఫెక్ట్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై పడుతుంది. ఈ ఏడాది దసరా బరిలో ఉండాల్సిన సినిమా ఇప్పుడు వచ్చే ఏడాదిలో దసరా వరకు వెళ్లిపోయేలా ఉందని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ తన సినిమా పట్ల ఇంత స్లో గా ఉండడం డార్లింగ్ ఫ్యాన్స్ కు పెద్ద పరీక్షనే పెడుతుంది. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తన చిత్రాల విషయాల్లో ఏం తొందర పడొద్దని భావిస్తున్నారట.ఇతర సినిమాలు ప్రకటించే డేట్లు బట్టి తన తర్వాత ప్రాజెక్టులు మరియు రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకోవాలని డార్లింగ్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు