మరో వైవిధ్య సినిమాతో “పలాస” డైరెక్టర్.?

మరో వైవిధ్య సినిమాతో “పలాస” డైరెక్టర్.?

Published on Jun 9, 2020 6:03 PM IST


ఈ ఏడాది తెలుగు తెర పైకి వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అండర్ రేటెడ్ చిత్రాల్లో “పలాస 1978” కూడా ఒకటి. అయితే అండర్ రేటెడ్ అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఈ చిత్రాన్ని తక్కువ మందే చూసినా చూసిన ప్రతీవారు మంచి ఫీడ్ బ్యాక్ నే ఇచ్చారు.

అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కరుణ కుమార్ ను కూడా టాలీవుడ్ ఆడియన్స్ మెచ్చుకున్నారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు మరో రూరల్ డ్రామా ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు గాను క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసినట్టు వినికిడి. ఈ చిత్రంలో హీరో సుధీర్ బాబు కనిపించనున్నారట. లాక్ డౌన్ అనంతరం ఈ చిత్రం పూర్తి స్థాయిలో పట్టాలెక్కనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు