చైనా లో ఓడిన బాహుబలి రష్యాను ఏలుతున్నాడు

చైనా లో ఓడిన బాహుబలి రష్యాను ఏలుతున్నాడు

Published on Jun 7, 2020 11:36 PM IST

బాహుబలి ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసిన చిత్రం అది. దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆల్ టైం రికార్డు తన పేరున రాసుకున్న బాహుబలి జపాన్, చైనా వంటి భాషలలో కూడా విడుదల అయ్యింది. జపాన్ లో ఈచిత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. అక్కడ ప్రభాస్ కి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఐతే చైనాలో బాహుబలికి ఆదరణ దక్కలేదు.

చైనా భాషలో బాహుబలి, బాహుబలి 2 కనీస ఆదరణ దక్కించుకోలేకపోయాయి. తాజాగా ఈ చిత్రాన్ని రష్యన్ భాషలో రష్యాలో విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంటుందని సమాచారం. రష్యన్ ప్రజలకు ఈ ఎపిక్ స్టోరీగా బాగా నచ్చిందట. ఈ విషయాన్ని రష్యన్ రాయబార కార్యాలయం వారు. ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. తాజాగా విడుదలైన ఆ చిత్రం అక్కడ ఎన్ని రికార్డ్స్ నెలకొల్పనుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు