మారిన నాయక్ చిత్ర ఆడియో విడుదల వేదిక

మారిన నాయక్ చిత్ర ఆడియో విడుదల వేదిక

Published on Dec 8, 2012 1:05 PM IST


రామ్ చరణ్, కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో రానున్న చిత్రం “నాయక్”. ఈ చిత్ర ఆడియో విడుదల వేదిక నెక్లెస్ రోడ్ కి మార్చారు. ఈ చిత్ర ఆడియో విడుదలకై భారీ వేదిక కోసం వెతుకుతున్నారని నిన్న తెలిపాము.ఇప్పుడు ఈ చిత్ర ఆడియోని నెక్లెస్ రోడ్లో డిసెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ఖరారు అయ్యింది. వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు “శుభలేఖ రాసుకున్న” పాట రీమిక్స్ ఉండటంతో ఈ చిత్ర ఆడియో మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్బం కూడా బాగా వచ్చిందని తమన్ మొదటినుండి చెప్తూ వచ్చారు. తమన్ మొదటిసారి రామ్ చరణ్ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో చాలా జాగ్రత్తలు తీసుకొని చేసారు. అయన అందించిన పాటలు సంగీత ప్రియులను మరియు అభిమానులను ఆకట్టుకుంటుంది అని అయన ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్లో జరుపుకుంటుంది. చిత్రం 2013 జనవరి 9న భారీ ఎత్తున విడుదల కానుంది.

తాజా వార్తలు