యంగ్ హీరో ఆది ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన చిన్నతనంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్న ఫోటో పంచుకొని ఓ అరుదైన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. 1991లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కలికాలం మూవీ మంచి విజయాన్ని అందుకుంది. మధ్య తరగతి మనుషుల సాధక బాధల ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రంలో చంద్ర మోహన్, జయసుధ ప్రధాన పాత్రలు చేయగా, హీరో సాయి కుమార్ ఓ కీలక రోల్ పోషించారు.
ఆ సినిమా 100రోజుల అవార్డు వేడుకలో తండ్రి సాయి కుమార్ కి బదులుగా ఆది సాయి కుమార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ అరుదైన సంఘటననే ఆది సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఆది సాయి కుమార్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన జంగిల్, శశి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మరో రెండు సినిమాలలో ఆయన నటిస్తున్నారు.
https://www.instagram.com/p/CAW2bOJlxlx/