హీరోలు దేవుళ్లు పొగిడితే తప్పేముంది..?

హీరోలు దేవుళ్లు పొగిడితే తప్పేముంది..?

Published on May 19, 2020 7:24 AM IST

నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ తాజా ఇంటర్వ్యూలో స్టార్ హీరోలను దేవుళ్ళు అన్నారు. భారీ మార్కెట్ కలిగిన స్టార్ హీరోల వలన అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. నిర్మాతలది ఏమి ఉండదు, స్టార్ హీరో డేట్స్ ఇస్తేనే మూవీ చేయగలడు. సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు చాలా కీలకం, వాళ్ళు డెమి గాడ్స్ అని బండ్ల గణేష్ అన్నారు. సినిమా వేదికలపై అందుకే వారిని అలా పొగిడేస్తూ ఉంటాను. అందులో తప్పేమీ లేదని బండ్ల గణేష్ చెప్పు కొచ్చారు.

అలాగే పరిశ్రమకు కనీసం 10మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలనే సంకల్పంతో ఉన్నాడట. పౌల్ట్రీ తన కుటుంబ వ్యాపారం… ఏళ్లుగా చేస్తున్నాం అన్నారు. ఇక ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం చిత్ర పరిశ్రమ పైనే, వరుసగా సినిమాలు చేయాలి అన్నారు. ఇక హరీష్ తో గొడవపై కూడా ఆయన స్పందించారు. కుటుంబ సభ్యుల మధ్యే గొడవలు వస్తుంటాయి, మేము మాటామాటా అనుకున్నాం. హరీష్ గొప్ప డైరెక్టర్, నాకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఐతే ఇకపై హరీష్ తో మూవీ చేయను… ఒకటి చేశా చాలు, అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు