మరోసారి డార్లింగ్ డామినేషన్ ఎట్ బాలీవుడ్.!

మరోసారి డార్లింగ్ డామినేషన్ ఎట్ బాలీవుడ్.!

Published on May 8, 2020 8:12 PM IST

మన టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్ కు ఉన్న అపారమైన క్రేజ్ ఖండాంతరాలను దాటింది. బాహుబలి మ్యానియాతో సొంతం చేసుకున్న ఈ క్రేజ్ ను డార్లింగ్ చాలా బ్యాలన్స్డ్ గా మైంటైన్ చేస్తూ “సాహో” వసూళ్లతో మరింత కొనసాగించారు. బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ గా మారిన డార్లింగ్ కు హిందీ జనంలోనే అశేషమైన ఆదరణ దక్కింది.

దీనితో అక్కడ ప్రభాస్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మరోసారి నిరూపితం అయ్యింది. హిందీలో కేవలం బాక్సాఫీస్ నే కాకుండా బుల్లితెరను కూడా డార్లింగ్ షేక్ చేసాడు. గత వారం పలు హిందీ సినిమాలతో పాటుగా తాను లేటెస్ట్ గా నటించిన బాహుబలి 2 మరియు సాహో చిత్రాలను అక్కడ ఛానెల్స్ లో టెలికాస్ట్ చెయ్యగా అన్ని చిత్రాలకు మించి ఈ రెండు చిత్రాలకు భారీ స్థాయి టెలివిజన్ ఇంప్రెషన్స్ వచ్చాయి.

వీటిలో రాజమౌళి తెరకెక్కించిన హిస్టారికల్ ఎపిక్ వండర్ బాహుబలి 2 చిత్రానికి గాను 73.89 లక్షల ఇంప్రెషన్స్ రాగా సుజీత్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో కు 83.34 లక్షల ఇంప్రెషన్స్ వచ్చినట్టుగా బిఆర్ఎసి(బ్రాడ్ క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా) వారు పొందుపరిచారు. అయితే సాహో ను మూడు సార్లు టెలికాస్ట్ చెయ్యగా రెండో అత్యధికంగా తెలుస్తుంది. దీనితో బాలీవుడ్ లో డార్లింగ్ డామినేషన్ అలాగే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు