26ఏళ్లకే రాజు రాణి అనే హిట్ మూవీ తీయడమే కాకుండా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు డైరెక్టర్ అట్లీ. ఇక తదుపరి చిత్రమే స్టార్ హీరో విజయ్ తో తేరీ తీశారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత రెండు చిత్రాలు మెర్సల్, బిగిల్ కూడా విజయ్ తోనే చేశాడు అట్లీ. అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. నాలుగు చిత్రాలతోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. బిగిల్ మూవీ విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసింది.
మరి ఈ స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ హీరో ఎవరు అనేదానిపై క్లారిటీ రాలేదు. తమిళ పరిశ్రమలో అట్లీ ఓ కే అంటే సినిమా చేసే స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయినా ఆయన ఎవరినీ కన్ఫర్మ్ చేయడంలేదు. కాగా ఆయన ద్రుష్టి అంతా ఇతర పరిశ్రమలపై ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ లేటైనా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక షారుక్ ఖాన్ నెక్స్ట్ మూవీ దర్శకుడు అట్లీ అని ఎప్పటినుండో వినిపిస్తుంది. మరి చూడాలి ఈ స్టార్ డైరెక్టర్ ఎవరితో సినిమా ఓకె చేస్తాడో.