పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎంతమంది ఉన్నా…. పవన్ కి తాను భక్తుడ్ని అని అవకాశం దొరికినప్పుడల్లా చెప్పుకుంటుంటాడు బండ్ల గణేష్. అయితే తాజాగా బండ్లకు పవర్ స్టార్ తో ఎట్టకేలకూ మళ్లీ ఓ సినిమా చేయాలని ఉందట. దాని కోసం సైలెంట్ గా గత కొన్ని నెలలు ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే వేరే నిర్మాతలతో సినిమాలు కమిట్ అయ్యారు. కానీ పవన్ వరుసగా సినిమాలు మళ్లీ చేయబోతుండటంతో బండ్ల ఎలాగైనా పవన్ ను ఒప్పించాలని మళ్లీ గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలనీ ఆశ పడుతున్నాడట.
వచ్చే ఏడాదిలోనైనా పవన్ ను సినిమా చేయడానికి ఒప్పించాలని బండ్ల ప్లాన్ చేస్తున్నాడట. ఆ మేరకు హరీష్ శంకర్ తో పాటు కొంతమంది స్టార్ డైరెక్టర్స్ తో కూడా ఇప్పటికే మాట్లాడాడు అట. ఎలాగూ కాంబినేషన్ లను కలిపేసి సినిమాలు నిర్మించడంలో బండ్ల గణేష్ కు బాగా అనుభవం. ఇప్పట్లో కాకపోయినా భవిష్యత్తులోనైనా పవర్ స్టార్ హీరోగా సినిమా చేసేలానే ఉన్నాడు. మరి బండ్ల ప్లాన్ పై పవర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.