బాలయ్య డైరెక్టర్ బర్త్ డే..ఎనీ అప్డేట్..?

బాలయ్య డైరెక్టర్ బర్త్ డే..ఎనీ అప్డేట్..?

Published on Apr 25, 2020 10:56 AM IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పుట్టిన రోజు నేడు. దీనితో ఆయన ప్రస్తుతం బాలయ్యతో తెరకెక్కిస్తున్న చిత్రంపై అప్డేట్ ఏమైనా ఉంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ కి డైరెక్టర్ బోయపాటి అంటే ప్రత్యేక అభిమానం కలదు. ఆయన బాలయ్యకు రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. వీరి కాంబినేషన్ లో ఫస్ట్ మూవీగా 2010లో సింహ విడుదలైంది. ఆ చిత్రం బాలయ్యకు భారీ హిట్ కట్టబెట్టింది.

ఇక 2014లో మళ్ళి వీరిద్దరూ కలిసి లెజెండ్ మూవీ చేశారు. ఆ చిత్రం సింహాకు మించిన విజయాన్ని అందుకుంది. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కూడా బోయపాటి మంచి కమర్షియల్ అంశాలతో కూడిన మాస్ సబ్జెక్టు తో తెరకెక్కిస్తుండగా బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని మిర్యాల రవీంధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు