టాలీవుడ్ లో రియల్ మెన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ పూర్తి చేసి రియల్ మెన్ అనిపించుకుంటున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మొదలుపెట్టిన ఈ సాంప్రదాయం టాలీవుడ్ మొత్తం పాకింది. ఆయన ఈ ఛాలెంజ్ మొదటగా రాజమౌళికి పాస్ చేయగా ఆయన తన ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లకు పాస్ చేశాడు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్ టాలీవుడ్ స్టార్ హీరోలైన నాగ్, బాలయ్య ,చిరు, వెంకీలకు విసిరాడు. వీరిలో ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్ పూర్తి చేశారు.
మరి ఎన్టీఆర్ ప్రేమగా బాబాయ్ బాలయ్యను నామినేట్ చేస్తే ఆయన ఇప్పటివరకు స్పందించక పోవడం ఆశ్చర్యం వేస్తుంది. కొందరైతే బాలయ్య చీపురు పట్టడం కష్టమే అంటున్నారు. ఎన్టీఆర్-బాలయ్య మధ్య మస్పర్దలు ఉన్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు బాలయ్య ఈ ఛాలెంజ్ స్కిప్ చేస్తే వాటికి బలం చేకూర్చినట్లు అవుతుంది. మరి బాలయ్య ఇప్పటికైనా స్పందిస్తే నందమూరి అభిమానులు చాల హ్యాపీగా ఫీల్ అవుతారు. మరో సీనియర్ హీరో నాగార్జున కూడా ఈ టాస్క్ పూర్తి చేయలేదు.