బలమైన ఎమోషనల్ కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. మరి ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల, చైతు – సాయిపల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్ తో లవ్ స్టోరీ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ ఓవర్సీస్ హక్కులు భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు కారణం సినిమా కాంబినేషన్. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దానికి తోడు సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూతో ఆమె నటించడం ఇదే ప్రథమం. అందుకే వీరి జోడీపై అంచనాలు పెరిగాయి. అందుకే ఓ ప్రముఖ ఛానెల్ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట.
డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. అయితే శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేస్తోన్న ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఫిదా చేసేలానే ఉన్నాడు.