సీనియర్ బాలీవుడ్ నటుడు మరియు ఫిలిం మేకర్ దేవానంద్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో లండన్ లోని హాస్పిటల్లో చనిపోయారు. ప్రస్తుతం ఆయనకి 88 ఏళ్ళ వయసు. కొద్ది రోజుల క్రితమే ఆయన మెడికల్ చెకప్ కోసం లండన్ వెళ్లారు. పంజాబ్ లోని గుర్దాస్పూర్ అనే గ్రామంలో జన్మించిన ఆయన లాహొర్ లోని యూనివర్సిటీలో చదువుకున్నారు. 1940 లో ముంబైకి మారిపోయారు. హమ్ ఎక్ హై అనే సినిమా బాలీవుడ్ లో రంగప్రవేశం చేసారు. తరువాత ఐదు దశాబ్దాల పాటు అగ్ర కథానాయకుడిగా కొనసాగారు. తన సోదరులు విజయ్ ఆనంద్ మరియు చేతన్ ఆనంద్ డైరెక్టర్ గా నిర్మాతగా పని చేసారు. ఆయన చివరి శ్వాస వరకు నటుడిగా దర్శకుడిగా ఎనలేని సేవ చేసారు. ఆయన నటించిన గైడ్. జువెల్ తీఫ్, కాలాపానీ, కాలా బజార్ చిత్రాలు బాలీవుడ్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!