ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా.!

ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా.!

Published on Nov 30, 2012 6:48 AM IST


ఎ.ఆర్ మురుగదాస్ డైరెక్షన్లో విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘తుపాకి’ సినిమా కొద్ది రోజుల క్రితం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎస్.వి.ఆర్ మీడియా పై శోభ ఈ సినిమాని తెలుగులో అందించారు. సినిమా మంచి విజయం అందుకోవడంతో ఆమె తన ఆనదాన్ని పత్రికా విలేకరులతో పంచుకున్నారు. ‘ టెర్రరిజం లోని స్లీపర్ సేల్స్ అనే ఒక కోణాన్ని కథావస్తువుగా యీసుకొని అద్భుతంగా తీసిన సినిమా ఇది. ఈ సినిమాతో విజయ్ కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆర్మీ వాళ్ళు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడతారు వారే లేకపోతే మనమంతా ఎమైపోతాము. ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. ఇకనుండి మా బ్యానర్ నుండి ఇలాంటి మంచి చిత్రాలనే అందిస్తామని’ శోభ అంది. ఈ సినిమాకి హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.

తాజా వార్తలు