యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్స్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ విజువల్ వండర్ “RRR”. మన దక్షిణాది నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రంగా సన్నద్ధం అవుతున్న ఈ చిత్రం విడుదల తేదీ కూడా ఈ మధ్యనే ఖరారు అయ్యింది.దీనితో ఈ చిత్రం తాలూకా బిజినెస్ కూడా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
ఈ చిత్రానికి ఇప్పుడు సీడెడ్ ప్రాంతంలో కళ్ళు చెదిరే ధర పలికిందట.ఇప్పుడు వస్తున్నా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అక్కడ భారీ మొత్తం 35 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం.ఈ మధ్య కాలంలో ఇదే భారీ మొత్తం.ఇది ఈ సినిమాపై ఉన్న అంచనాలకు విట్నెస్ అని కూడా చెప్పొచ్చు.డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తుండగా అజయ్ దేవ్ గన్ మరియు అలియా భట్ కీలక పాత్రలు పోషించనున్నారు.