ప్రభాస్ తో దీపికా పదుకొనే..నిజం ఏమిటంటే?

ప్రభాస్ తో దీపికా పదుకొనే..నిజం ఏమిటంటే?

Published on Mar 1, 2020 6:41 PM IST

ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్న ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. మెగా ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. ప్రభాస్ సూపర్ హీరోలా కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతుంది.

ఐతే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనె నటిస్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని ఈ విషయం గురించి అడుగగా ఇందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. మా సినిమాలో దీపికా నటిస్తున్నట్లు మాకు గాని ఆమెకు గాని తెలియదు అని సెటైర్ వేశారు. ఈ భారీ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. 2021 డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశం కలదు.

తాజా వార్తలు