సమంత హిట్ మూవీ సీక్వెల్ లో హీరోయిన్ గా అనుష్క..?

సమంత హిట్ మూవీ సీక్వెల్ లో హీరోయిన్ గా అనుష్క..?

Published on Mar 1, 2020 2:51 PM IST

ఏంజెల్ సమంతను వెండి తెరకు పరిచయం చేసిన చిత్రం ఏమాయ చేశావే. నాగ చైతన్య హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ చిత్రం తమిళంలో విన్నాయ్ తాండి వరువాయా అనే టైటిల్ తో తెరకెక్కగా శింబు, త్రిషా నటించారు. కాగా గతంలో ఈ చిత్రానికి సీక్వెల్ గా మళ్ళీ శింభుతోనే చేస్తాను అన్న గౌతమ్ హీరోయిన్ గా అనుష్క ను అనుకుంటున్నాను అని ఆసక్తికర సమాధానం చెప్పారు.

ఈ మూవీ సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన గౌతమ్ శింబు సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాడట. కొంచెం వళ్ళు చేసి బొద్దుగా తయారైన అనుష్కను ఇలాంటి లవ్ అండ్ యూత్ ఫుల్ మూవీకి హీరోయిన్ గా తీసుకోవడం వెనుక దర్శకుడి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 2న పలు భాషలలో విడుదల కానుంది.

తాజా వార్తలు