పవన్ ఫస్ట్ లుక్ సిద్ధం..!

పవన్ ఫస్ట్ లుక్ సిద్ధం..!

Published on Feb 29, 2020 10:26 AM IST

పవన్ ని ఫ్యాన్స్ వెండి తెరపై చూసి రెండేళ్లు అవుతుంది. దీనితో వాళ్ళు ఆయన కొత్త చిత్రాల అప్డేట్స్ కొరకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్న తరుణంలో దీనిపై అప్డేట్ వస్తుందనే ఆశలో ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ చాల అతృతతో ఉన్నారు. కాగా నేడు దీనిపై స్పష్టత ఇచ్చారు. త్వరలో పవన్ పింక్ రీమేక్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల 2వ తారీఖున పవన్ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ వచ్చే అవకాశం కలదని ప్రచారం జరుగుతుంది. లేదంటే మార్చి 8న ఉమెన్స్ డే కానుకగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రావచ్చట.

దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. పవన్ మొదటిసారి లాయర్ రోల్ చేస్తుండగా మేలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు

తాజా వార్తలు