తలైవి నుండి ఎంజిఆర్ గా అరవింద స్వామి.

తలైవి నుండి ఎంజిఆర్ గా అరవింద స్వామి.

Published on Jan 17, 2020 10:01 AM IST

తమిళనాట రాజకీయ సంచలనం, తమిళ ప్రజల ఆరాధ్య దైవం జయలలిత జీవితం ఓ మహా గ్రంథం. ఆమె నటీగా జీవితం ప్రారంభించిన నాటి నుండి చనిపోయే వరకు ఆమె జీవితం అనేక సంచలనాల సమాహారం. దీనితో ఆమె మరణం తరువాత అనేక మంది జయలలిత పై బయోపిక్స్ తీయడానికి ముందుకొచ్చారు. కాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలితగా తలైవి పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం కొరకు కంగనా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం జయలలితగా కంగనా లుక్ తో పాటు, ఓ చిన్న వీడియో విడుదల చేశారు.

కాగా జయలలిత జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎం జి ఆర్ రోల్ ఈ చిత్రంలో ప్రత్యేకంగా నిలవనుంది. నటిగా, రాజకీయాల పరంగా ఆమెకు మద్దతుగా నిలిచిన ఎం జి ఆర్ పాత్రను, ఈ చిత్రంలో ప్రత్యేకంగా మలుస్తున్నారు. అందుకే ఆ పాత్ర కోసం టాలెంటెడ్ నటుడు అరవింద స్వామిని తీసుకున్నారు. నేడు ఎం జి ఆర్ జయంతిని పురస్కరించుకొని ఎం జి ఆర్ గా అరవింద స్వామి లుక్ విడుదల చేశారు. టి షర్ట్ టక్ ఇన్ లో ఉన్న అరవింద స్వామి లుక్ ఎం జి ఆర్ కి చాలా దగ్గరగా అనిపించింది. ఇక ఈ చిత్రానికి ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు