షార్ట్ ఫిల్మ్ కోసం డిఫరెంట్ రోల్ లో శృతి హాసన్

షార్ట్ ఫిల్మ్ కోసం డిఫరెంట్ రోల్ లో శృతి హాసన్

Published on Jan 16, 2020 10:00 PM IST

ఓ హిందీ షార్ట్ ఫిల్మ్ లో శృతి హాసన్ ఓ భిన్నమైన రోల్ చేస్తున్నారు. దేవి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈషార్ట్ ఫిల్మ్ నందు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.కాగా దేవి షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. భిన్న మతాలు, నేపధ్యాలు కలిగి వివిధ ఏజ్ గ్రూప్స్ కి చెందిన మహిళలు ఓ చోట చేరి ఉన్న ఫోటో ఆసక్తిని రేపుతుంది. ఆ ఫొటోలో శృతి హాసన్ మాత్రమే మోడ్రన్ గెటప్ లో ఉన్నారు. దీనితో ఈ షార్ట్ ఫిల్మ్ లో శృతి హాసన్ రోల్ పై ఆసక్తి నెలకొంది.

ప్రియాంకా బెనర్జీ ఈ షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహిస్తుండగా, ఎలక్ట్రిక్ ఆపిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో నిర్మిస్తున్నారు. ఇక తెలుగులో శృతి హాసన్ రవితేజ హీరోగా దర్శకుడు గోపి చంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ చిత్రంలో నటిస్తున్నారు. క్రాక్ మూవీలో శృతి రవితేజ భార్యగా..ఓ పిల్లాడి తండ్రిగా గృహిణి రోల్ చేస్తుంది. ఈ చిత్రంలో సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక రోల్స్ చేస్తుండగా బి మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

తాజా వార్తలు