యాక్షన్ హీరో గోపి చంద్ ఈ సారి స్పోర్ట్స్ డ్రామాతో రానున్నాడు. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ గా గోపి చంద్ కనిపించనున్నాడని తెలుస్తుంది. గోపి చంద్ తో తమన్నా తొలిసారిగా జత కడుతుండగా ఆమె కూడా స్పోర్ట్స్ విమెన్ గా చేస్తున్నారని సమాచారం. నేడు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దర్శకుడు సంపత్ నంది ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఆత్రేయ పురం అనే ఓ పల్లెటూరి సెట్స్ లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. రావు రమేష్ ఓ కీలక రోల్ చేస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ నుండి చాల మంది ప్రతిభ కలిగిన నటులు నటిస్తున్నారట. సంపత్ నంది ఎలాగైన హిట్ కొట్టి ఫార్మ్ లోకి రావాలని చాలా కష్టపడుతున్నాడట. ఈ మూవీ టైటిల్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. గతంలో గోపి చంద్, సంపత్ నంది కాంబినేషన్ లో గౌతమ్ నంద చిత్రం వచ్చింది .
A glimpse of #Gopichand28…#HappySankranthi @SS_Screens pic.twitter.com/hgseSv6jbv
— Sampath Nandi (@IamSampathNandi) January 15, 2020