ఇకపై ప్రతి సినిమాకి అతడితో కలిసి పనిచేస్తానన్న మహేష్

ఇకపై ప్రతి సినిమాకి అతడితో కలిసి పనిచేస్తానన్న మహేష్

Published on Jan 15, 2020 3:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా మహేష్ బాబు చాలా కొత్తగా కనబడ్డారని చెబుతున్నారు. నటనలో, డ్యాన్సుల్లో మహేష్ జోష్ హైలెట్ అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ‘మైండ్ బ్లాక్’ పాటలో మహేష్ మూమెంట్స్ అభిమానుల్ని విపరీతంగా అలరించాయి.

ఇకపై మహేష్ ప్రతి సినిమాలో ఇలాంటి పాట ఒకటి ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో కోరుతున్నారు. అంతేకాదు మైండ్ బ్లాక్ పాటను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ తో ఇకపై కూడా పనిచేయాలని ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుని కోరారు. మహేష్ సైతం శేఖర్ మాస్టర్ మంచి డ్యాన్సులు కంపోజ్ చేశారని, ఇకపై ప్రతి సినిమాకు ఆయనతో కలిసి పనిచేస్తానని అన్నారు.

తాజా వార్తలు