పూర్తయిన గౌరవం టాకీ

పూర్తయిన గౌరవం టాకీ

Published on Nov 12, 2012 10:00 PM IST

అల్లు శిరీష్ మరియు యామి గౌతం ప్రధాన పాత్రలలో రానున్న “గౌరవం” ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ మధ్యనే ఈ చిత్రం చెన్నైలో టాకీ భాగాన్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో అల్లు శిరీష్ హీరోగా పరిచయం కానున్నారు ఈ చిత్రంలో మరో రెండు పాటలు మాత్రమే మిగిలున్నాయి, మిగిలిన చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది అని అల్లు శిరీష్ తెలిపారు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ మీద ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి చివర్లో కాని ఫిబ్రవరి మొదట్లో కాని విడుదల చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు