జనవరిలో వరుణ్ సందేశ్ – నిషా కొత్త సినిమా

జనవరిలో వరుణ్ సందేశ్ – నిషా కొత్త సినిమా

Published on Nov 12, 2012 9:50 PM IST

గతంలో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ కాంబినేషన్లో ‘ఏమైంది ఈ వేళ’ సినిమా వచ్చింది. మసాలా దట్టించిన ఈ సినిమా హిట్ కావడంతో అదే కాంబినేషన్ క్రేజ్ క్యాష్ చేసుకోడానికి మరో సినిమా చేస్తున్నారు. వీరిద్దరు జంటగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీలో నన్నే కొద్దిగా ప్రేమించు అనే పాట చిత్రీకరించారు. భాను శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ కుమార స్వామి బ్యానర్ పై పత్తికొండ కుమారస్వామి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డిసెంబర్ వరకు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రవివర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు