రాత్రి పూట సాహసాలు చేసే మైత్రి

రాత్రి పూట సాహసాలు చేసే మైత్రి

Published on Nov 12, 2012 2:33 PM IST


త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘మైత్రి’. ఇందులో మైత్రి పాత్రని సదా పోషిస్తున్నారు. పగటి పూట మాత్రం అందరితో ఎంతో విధేయంగా ఉండే మైత్రిలో సూర్యుడు అస్తమించగానే అనుకోని మార్పులు వస్తాయి. చీకటవ్వగానే తను చాలా భయంకరంగా మారిపోతుంది. ఒక్కటే అన్ని ప్రదేశాల్లోనూ సంచరిస్తూ ఉంటుంది. మైత్రి అలా ఎందుకు మారుతోంది? దాని వెనకున్న కారణం ఏమిటి అనేదే ఈ చిత్ర కథాంశం. సదాకి జోడీగా నవదీప్ నటిస్తున్నారు. వికాస్ సంగీతం అందించిన ఈ సినిమాకి సూర్య రాజు దర్శకత్వం వహించారు. రాజేష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు