త్వరలోనే తమిళ సినిమా చేస్తానంటున్న భామ

త్వరలోనే తమిళ సినిమా చేస్తానంటున్న భామ

Published on Nov 4, 2012 9:30 PM IST


‘గబ్బర్ సింగ్’ సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రుతి హాసన్ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. గత నెల ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ సినిమా కోసం ముంబైకి సమీపంలోని మారతన్ లో జరిగిన షెడ్యూల్ ని శ్రుతి హాసన్ పూర్తి చేసారు. ఆమె త్వరలోనే రవితేజ హీరోగా ప్రారంభంకానున్న ‘బలుపు’ చిత్ర చిత్రీకరణలో పాల్గొననున్నారు. ‘ గత మూడు నెలలుగా మూడు సినిమాల్లో నటిస్తున్నాను, ఇంకా కొన్ని సినిమాలు చేయాల్సి ఉంది షూటింగ్, సింగింగ్ లతో బిజీగా సంతోషంగా గడుపుతున్నాను. తొందర్లోనే తమిళంలో ఒక సినిమా చేస్తానని, ప్రస్తుతం ఒప్పుకొని ఉన్న సినిమాలు చివరి దశకు చేరుకోగానే తమిళ సినిమా ఖచ్చితంగా చేస్తానని’ శ్రుతి హాసన్ ట్వీట్ చేసారు. ఇటీవలే ధనుష్ సరసన తమిళంలో నటించిన ‘3’ సినిమాలో శ్రుతి నటనకి మంచి ప్రశంశలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో స్టార్డం తెచ్చుకుంది. శ్రుతికి 2013 సంవత్సరం చాలా కీలకం కానుంది. నటిగా మరియు సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామకి తను చేస్తున్న సినిమాలు తన కెరీర్ కి ఎంత వరకు సాయపడతాయో? వేచి చూడాలి మరి.

తాజా వార్తలు