ఈ దీపావళి నాగ్ అభిమానులకు విజువల్ ట్రీట్

ఈ దీపావళి నాగ్ అభిమానులకు విజువల్ ట్రీట్

Published on Nov 4, 2012 4:52 PM IST


‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్లో మొదటి సారిగా చేసిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు 45 నిమిషాల పాటు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్స్ మరియు ఫోటోలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. దానికి తోడు నాగార్జున ‘ఈగ’ సినిమా కంటే విజువల్ ఎఫెక్ట్స్ కంటే బాగా ఉంటాయి అని చెప్పడంతో నాగ్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ‘డమరుకం’ నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. యోగా బ్యూటీ అనుష్క మరోసారి నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడి దీపావళి కానుకగా నాగ్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ‘డమరుకం’ వచ్చేస్తోంది.

తాజా వార్తలు